king mir usman ali khan: నిజాం నవాబు వారసుడి కన్నుమూత!

  • హైదరాబాదును పాలించిన చివరి నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌
  •  ఆయన తనయుడే నవాబ్ ఫజల్ జహా బహదూర్
  • పూర్వీకుల సమాధుల పక్కనే అంతిమ సంస్కారం 

హైదరాబాదును పాలించిన ఏడో నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ కుమారుడు నవాబ్‌ ఫజల్‌ జహా బహదూర్‌ (72) కన్నుమూశారు. హైదరాబాదులోని కింగ్‌ కోఠిలోని తన స్వగృహంలో అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూయగా, పూర్వీకుల సమాధుల పక్కనే ఆయన పార్థివ దేహానికి కుటుంబ సభ్యులు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. హైదరాబాదు రాష్ట్రాన్ని పాలించిన చివరి నిజాం వంశ పాలకుడైన ఏడో నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌, సాహెబా లీలాబేగం దంపతులకు ఆయన 1946 ఫిబ్రవరి 29న జన్మించారు.

నిజాం పాలన అంతమైన తరువాత నిజాంకు సంబంధించిన వివిధ ట్రస్టుల వ్యవహారాలను నవాబ్ ఫజల్ జహా బహదూర్ చూసుకున్నారు. సౌదీ అరేబియాలో హజ్‌ యాత్రికుల బస కోసం నిజాం నిర్మించిన అతిథిగృహం ‘హైదరాబాద్‌ రుబాత్‌’ వ్యవహారాల బాధ్యతలను కూడా ఆయనే నిర్వహించారు. కాగా, ఆయనకు భార్య సాహెబ్‌ జాదీ దర్వేరున్నీసాబేగం, వారసుడు (కుమారుడు) ఉన్నారు.

More Telugu News