apple: ఆండ్రాయిడ్ లో లేనివీ... యాపిల్ ఐవోఎస్ కొత్త వెర్షన్ లో ఉన్నవి ఏమిటంటే..!

  • బ్యాటరీ, ప్రాసెసర్ పనితీరును పెంచే కొత్త వెర్షన్
  • ఆండ్రాయిడ్ ఓరియో 8.1కు అందనంత దూరంలో యాపిల్ ఐవోఎస్ 11.3
  • ప్రస్తుతం బీటా టెస్టింగ్ దశలో

యాపిల్ ఐఫోన్లు ఎందుకంత ఖరీదు? అన్న సందేహం చాలా మందిలో ఉంటుంది. కానీ, ఆండ్రాయిడ్ ఫోన్లలో లేని కొన్ని సదుపాయాలు ఐఫోన్లలో ఉన్నాయి. ఆండ్రాయిడ్ ఓరియో 8.1 ఓరియోకు దీటుగా ఐవోఎస్ తాజా వెర్షన్ 11.3 బీటా టెస్టింగ్ లో ఉంది. ఇది బ్యాటరీ, ప్రాసెసర్, పనితీరు పరంగా ఐఫోన్ ను మరింత మెరుగ్గా తయారు చేయనుంది.  

ఐవోఎస్ 11.3 వెర్షన్ లో స్పామ్ మెస్సేజ్ ఫిల్టర్ ఉంది. అలాగే, డివైజ్ డిస్ ప్లే కంటెంట్స్ ను వాయిస్ రూపంలో రికార్డ్ చేయగలదు. జిఫ్ లను కూడా సృష్టించగలదు. మెస్సేజింగ్ యాప్ ఐక్లౌడ్ ను సపోర్ట్ చేస్తుంది. అంటే అన్ని యాపిల్ డివైజెస్ లో ఒకే ఐడీ ద్వారా ఏక కాలంలో మెస్సేజ్ ల సింక్రనైజ్ కు వీలుంటుంది. మెస్సేజింగ్ యాప్ నుంచే బ్యాంకు ఖాతాకు డబ్బులు పంపడం, స్వీకరించడం సాధ్యం అవుతుంది. బ్యాటరీ, ప్రాసెసర్ పనితీరును మరింత మెరుగుపరచనుంది తాజా వెర్షన్. వీడియోను చిత్రీకరించి దాన్ని కంప్రెస్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా నాణ్యత ఏ మాత్రం కోల్పోకుండా తక్కువ స్పేస్ లోనే సేవ్ చేసుకోవచ్చు.

More Telugu News