Mahanati: అనుష్కకు మరో ఛాలెంజింగ్ ఆఫర్.. భానుమతిగా స్వీటీ?

  • 'మహానటి'లో భానుమతి పాత్రలో నటించే ఛాన్స్
  • అనుష్క అంగీకారంపై నెలకొన్న సస్పెన్స్
  • వచ్చే నెల 20న ప్రేక్షకుల ముందుకు 'మహానటి'

అందమైన అభినయానికి మారుపేరుగా నిలిచిన అనుష్క టాలీవుడ్ సినిమాల్లో చేసిన కొన్ని పాత్రలు చూస్తుంటే.. అవి ఆమె కోసమే పుట్టాయా? అని అనిపిస్తుంటుంది. ఆ పాత్రలకు ఆమె అంతలా న్యాయం చేసింది. ఓ రకంగా జీవం పోసిందని చెప్పాలి. ఆమె తప్ప మరెవ్వరూ ఆ రోల్స్‌కు సూట్ కారని ప్రేక్షకులు, అభిమానులు కూడా గట్టిగా చెబుతుంటారు. అరుంధతి, రుద్రమదేవి, భాగమతి చిత్రాలు ఆ కోవలోకే వస్తాయి. తాజాగా మరో క్రేజీ పాత్ర ఆమె తలుపు తట్టినట్లు సమాచారమ్. కీర్తి సురేష్ టైటిల్ రోల్ పోషిస్తోన్న 'మహానటి' సినిమాలో అలనాటి నటి, బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతి పాత్రను ఈ సినిమాలో అనుష్క పోషించనుందనే వార్త టాలీవుడ్ సర్కిళ్లలో చక్కర్లు కొడుతోంది. అయితే ఇందుకు ఆమె  గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

అలనాటి అందాల నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సమంత ఇందులో పాత్రికేయురాలి పాత్ర చేసింది. సావిత్ర, భానుమతి సమకాలీన నటీమణులు. ఇద్దరూ ఆ సమయంలో పోటాపోటీగా సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకున్నవారే. మహానటి చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సి.అశ్వినీదత్ తన వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో నిర్మిస్తున్నారు. నాగ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ బాణీలు అందించారు. వచ్చే నెల 20న దీనిని రిలీజ్ చేయడానికి దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

More Telugu News