leopard: ఎట్టకేలకు చిక్కిన చిరుతపులి.. చివరి నిమిషంలోనూ గ్రామస్తులను పరుగులు పెట్టించిన వైనం

  • ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని ల‌క్నోలోని ఓ కాలనీలో ఘటన
  • దారి తప్పి జనావాసాల్లోకి వచ్చిన వైనం
  • మూడు రోజులుగా ముప్పుతిప్పలు

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని ల‌క్నోలోని ఔరంగాబాద్‌, ఆషియానా కాల‌నీలోకి ప్ర‌వేశించిన ఓ చిరుత పులి స్థానికుల‌ను బెంబేలెత్తిస్తోన్న విష‌యం తెలిసిందే. ఆ చిరుత దారి తప్పి జనావాసాల్లోకి రావ‌డంతో మూడు రోజులుగా ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌లు వ్య‌క్తం చేస్తున్నారు. ఆ చిరుత‌పులి చిక్కిన‌ట్లే చిక్కి తప్పించుకుంటుండం మ‌రింత భ‌యానికి గురి చేసింది. అయితే, ఫారెస్ట్ సిబ్బంది ఈ రోజు ఎట్ట‌కేల‌కు ఆ చిరుత పులిని ప‌ట్టుకున్నారు. అంతకుముందు ఈ రోజు కూడా ఆ చిరుత ప్ర‌జ‌ల‌ను బెంబేలెత్తించింది. దాన్ని ప‌ట్టుకుంటుండ‌గా తీసిన దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.  

More Telugu News