rajanikanth: ‘కావేరీ’పై సుప్రీం తీర్పు నిరాశ పరిచింది: రజనీకాంత్

  • రైతుల జీవనోపాధి దెబ్బతింటుంది
  • తమిళనాడు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలి
  • మరోసారి రివ్యూ పిటిషన్ వేయాలి 

కావేరీ నదీ జలాల వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రముఖ నటుడు రజనీకాంత్ స్పందించారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. ఈ తీర్పు నిరాశపరిచిందని, దీని ప్రభావంతో   రైతుల జీవనోపాధి దెబ్బతింటుందని, తమిళనాడు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.

ఈ తీర్పు పునఃపరిశీలన నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని తన ట్వీట్ లో రజనీ కోరారు. కాగా, తమిళనాడుకు న్యాయబద్ధంగా ఏటా 177.25 టీఎంసీలు కేటాయిస్తూ, కర్ణాటకలో పెరుగుతున్న అవసరాల దృష్ట్యా మరో 14.75 టీఎంసీల నీటిని ఆ రాష్ట్రం వాడుకోవచ్చని సుప్రీంకోర్టు నిన్న తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే.

More Telugu News