Mahesh Babu: మెకానిక్ గా మహేశ్ బాబు .. దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగా?

  • మహేశ్ కి లైన్ వినిపించిన సందీప్ రెడ్డి వంగా
  • గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మహేశ్ బాబు 
  • వచ్చేఏడాది ఆరంభంలో సెట్స్ పైకి

'అర్జున్ రెడ్డి' సినిమాతో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సంచలన విజయాన్ని సాధించాడు. ఈ సినిమాతో ఆయన ఇటు యూత్ .. అటు ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించాడు. ఆయన తదుపరి సినిమా ఏ హీరోతో వుండనుందా అనే ఆసక్తి అందరిలోను మొదలైంది. ఈ నేపథ్యంలో హీరోగా మహేశ్ బాబు పేరు ఎక్కువగా వినిపిస్తోంది.

 ఇటీవల ఆయన మహేశ్ బాబును కలిసి ఒక లైన్ చెప్పాడనీ, అది ఆయనకి బాగా నచ్చేసిందనే టాక్ వచ్చింది. ఈ సినిమాలో మహేశ్ బాబు కారు మెకానిక్ గా కనిపించనున్నాడనేది తాజా సమాచారం. కథ మొత్తం ఈ పాత్ర చుట్టూనే తిరుగుతుందట. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా కంటెంట్ ఉంటుందని చెప్పుకుంటున్నారు. మహేశ్ బాబు ఈ ఏడాది వంశీ పైడిపల్లితో సినిమాను పూర్తి చేసేసి, వచ్చే ఏడాది ఆరంభంలో సందీప్ రెడ్డి వంగాతో చేయనున్నాడని అంటున్నారు. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.   

More Telugu News