mehreen: మెహ్రీన్ కి దక్కాల్సిన ఛాన్స్ అలా చేజారిపోయిందట!

  • బరువు తగ్గని మెహ్రీన్ 
  • చేజారిన 'తొలిప్రేమ' ఛాన్స్ 
  • స్లిమ్ కావడం కోసం కసరత్తు

ఈ మధ్య కాలంలో తెలుగు తెరకి పరిచయమైన అందమైన కథానాయికల జాబితాలో మెహ్రీన్ ఒకరుగా కనిపిస్తుంది. 'కృష్ణగాడి వీర ప్రేమగాథ' .. 'మహానుభావుడు' .. 'రాజా ది గ్రేట్' వంటి సినిమాలతో ఈ సుందరి ఘన విజయాలను అందుకుంది. దర్శకుడు వెంకీ అట్లూరి ముందుగా 'తొలిప్రేమ' కోసం మెహ్రీన్ ను అనుకున్నారు. ఆమెను సంప్రదించారట కూడా.

అయితే మెహ్రీన్ బాగా లావుగా కనిపించడంతో, ఆమె కంటే రాశి ఖన్నా అయితే బాగుంటుందనే అభిప్రాయానికి వచ్చారట. దాంతో ఈ సినిమా ఛాన్స్ మెహ్రీన్ నుంచి రాశి ఖన్నాకు వెళ్లింది. ఇంతకుముందు మెహ్రీన్ చేసిన సినిమాలు చూసినవాళ్లు  .. ఆమె బరువు తగ్గాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఆ మాటలను మెహ్రీన్ పట్టించుకోకపోవడం వలన ఈ ఛాన్స్ చేజారిపోయింది. అప్పటి నుంచి బరువు తగ్గడంపై మెహ్రీన్ దృష్టి పెట్టిందనీ .. కసరత్తు మొదలెట్టిందని అంటున్నారు.     

More Telugu News