thaman: దూకుడు మీదున్న తమన్ .. రవితేజ తాజా చిత్రానికీ ఆయనే!

షార్ట్స్‌లో చూడండి
తెలుగు సినీ సంగీత దర్శకులలో తమన్ కి ప్రత్యేకమైన స్థానం వుంది. యువ కథానాయకులు చేస్తోన్న సినిమాల్లో వరుసగా అవకాశాలను దక్కించుకుంటూ తన సత్తా చాటుతున్నాడు. రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'భాగమతి' .. 'తొలిప్రేమ' సినిమాలు ఆయనకి మంచి పేరు తెచ్చిపెట్టాయి. దాంతో కొత్తగా వచ్చిపడుతున్న అవకాశాలతో ఆయన ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు.

మంచు విష్ణు 'ఆచారి అమెరికా యాత్ర' .. నితిన్ 'చల్ మోహన్ రంగ' సినిమాకి సంగీతాన్ని అందించిన ఆయన, రవితేజ సినిమాకి బాణీలు కట్టడానికి రెడీ అవుతున్నాడు. శ్రీను వైట్ల దర్శకత్వంలో 'అమర్ అక్బర్ ఆంథోని' సినిమా చేయడానికి రవితేజ సిద్ధమవుతున్నాడు. రవితేజ మూడు విభిన్నమైన పాత్రలను పోషించనున్న ఈ సినిమాలో ముగ్గురు కథానాయికలు నటించనున్నారు. ఈ సినిమాకి సంగీతాన్ని అందించే అవకాశం తమన్ కి దక్కింది. ఈ సినిమాతో పాటు మరికొన్ని ప్రాజెక్టులకు కూడా తమన్ సైన్ చేయడం చూస్తుంటే, ఆయన దూకుడు ఒక రేంజ్ లో ఉందనే విషయం అర్థమైపోవడం లేదూ!
Go Back to Shorts
thaman

More Telugu News