ఈ నేతలు మారరా? రోడ్డు పక్కన కాన్వాయ్ ఆపి గోడలపై రాజస్థాన్ మంత్రి మూత్ర విసర్జన... వైరల్ అవుతున్న ఫోటో!
- జైపూర్ లో కారును ఆపించిన ఆరోగ్య మంత్రి కాళీచరణ్ సరాఫ్
- ఆపై పక్కనే ఉన్న గోడ వద్దకు వెళ్లి మూత్ర విసర్జన
- వైరల్ అవుతున్న ఫొటో
- ఇదేమీ పెద్ద విషయం కాదంటున్న మంత్రి
స్వచ్ఛ భారత్ అభియాన్ లో పోటీకి నిలిచిన జైపూర్ ను మరింత పరిశుభ్రం చేయాలని మునిసిపల్ కార్పొరేషన్ ఎంతో శ్రమిస్తుంటే, స్వయంగా ఆరోగ్య మంత్రిగా ఉన్న సరాఫ్ ఈ పని చేయడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సాధారణ ప్రజులు ఎవరైనా ఇలా బహిరంగంగా గోడలను తడిపితే రూ. 200 జరిమానా వేస్తున్న అధికారులు, ప్రజా ప్రతినిధులను మాత్రం ఏమీ చేయడం లేదని, ప్రజలు మారుతున్నా, ఈ నేతలు మారడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. కాగా, తన ఫోటో వైరల్ అవుతుండటంపై స్పందించిన సరాఫ్, ఇదేమీ అంత పెద్ద విషయం కాదని వ్యాఖ్యానించడం గమనార్హం.