varun tej: 'తొలిప్రేమ' చూసి చిరూ ఆశ్చర్యపోయారన్న వరుణ్ తేజ్

  • వెంకీ అట్లూరికి చిరూ కాంప్లిమెంట్
  • దర్శకుడికి మంచి భవిష్యత్తు వుంది 
  • ప్రేక్షకులకు వరుణ్ తేజ్ ధన్యవాదాలు

వెంకీ అట్లూరి దర్శకత్వంలో వరుణ్ తేజ్ .. రాశి ఖన్నా జంటగా తెరకెక్కిన 'తొలిప్రేమ', విడుదలైన ప్రతిచోటా విజయవిహారం చేస్తోంది. యూత్ నుంచి ఈ సినిమాకి అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. అంచనాలకి మించి ఈ సినిమా భారీ వసూళ్లను సాధిస్తూ ఉండటంతో, తాజాగా ఈ సినిమా టీమ్ సక్సెస్ మీట్ ను నిర్వహించింది.

ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ, ఈ సినిమాకి నిర్మాత కాకపోయినా కంటెంట్ పై గల నమ్మకంతో ముందుకు నడిపించిన దిల్ రాజుకి కృతజ్ఞతలు తెలియజేశాడు. ఈ సినిమా చూసిన చిరంజీవిగారు .. "ఒక కొత్త దర్శకుడు మొదటి సినిమాను ఇంత బాగా తీశాడా?" అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారని చెప్పాడు. చిరంజీవిగారి నుంచి ఇంతటి కాంప్లిమెంట్ రావడం చూస్తుంటే, వెంకీ అట్లూరికి మంచి భవిష్యత్తు ఉందని అర్థమవుతోందని అన్నాడు. ఈ సినిమాను ఈ స్థాయిలో ఆదరిస్తోన్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేశాడు.    

More Telugu News