pakistan: కొత్త తరహా అణ్వాయుధాల తయారీలో పాకిస్థాన్... హెచ్చరించిన అమెరికా ఇంటెలిజెన్స్

  • టాక్టికల్ వెపన్స్, క్రూయిజ్ మిసైల్స్
  • వీటివల్ల రక్షణపరమైన సమస్యలు
  • అమెరికా ఇంటెలిజెన్స్ డైరెక్టర్ డాన్ కోట్

పాకిస్థాన్ కొత్త తరహా అణ్వాయుధాలను తయారు చేస్తోందంటూ అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ హెచ్చరించారు. నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ డాన్ కోట్ ఇంటెలిజెన్స్ పై జరిగిన ఓ సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. "పాకిస్థాన్ అణ్వాయుధాల అభివృద్ధిని కొనసాగిస్తూనే ఉంది. కొత్త తరహా అణ్వాయుధాలను అభివృద్ధి చేస్తోంది. వీటిలో టాక్టికల్ వెపన్స్, సముద్రంపై ప్రయోగించే క్రూయిజ్ మిసైల్స్, వాయుమార్గంలో వినియోగించే క్రూయిజ్ మిసైల్స్, దూరశ్రేణి బాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి’’ అని ఆయన హెచ్చరించారు.

ఈ కొత్త తరహా ఆయుధాల తయారీ ఆ ప్రాంతంలో రక్షణ సంబంధిత సమస్యలకు దారితీస్తుందన్నారు. కొత్త తరహా అణ్వాయుధాలను అభివృద్ధి చేయడం ద్వారా అమెరికా ప్రయోజనాలకు పాకిస్థాన్ ముప్పుగా మారుతోందన్నారు. పాకిస్థాన్ మద్దతు కలిగిన ఉగ్రవాద గ్రూపులు భారత్ లో తమ దాడులు కొనసాగిస్తున్నాయని, రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు కారణమవుతున్నాయని డాన్ కోట్ పేర్కొన్నారు. 

More Telugu News