Priya P Warrier: సోషల్ మీడియా సెన్సేషన్, నటి ప్రియా వారియర్ పై హైదరాబాదులో కేసు నమోదు

  • ఫలక్ నుమా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు
  • ముస్లింల మనోభావాలను గాయపరిచిందంటూ ఫిర్యాదు
  • ప్రియపై ఫిర్యాదు చేసిన పలువురు ముస్లిం యువకులు

కేరళ నటి ప్రియా వారియర్ పై హైదరాబాదులోని ఫలక్ నుమా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ముస్లింల మనోభావాలు దెబ్బతినేలా ఓ పాటలో ఆమె నటించిందంటూ ఫిర్యాదులో ఆరోపించారు. పలువురు ముస్లిం యువకులు ఈ మేరకు ఆమెపై పీఎస్ లో ఫిర్యాదు చేశారు.  

కేవలం 26 సెకన్ల నిడివి ఉన్న ఓ వీడియోతో ఈ టీనేజర్ సోషల్ మీడియా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఏళ్లపాటు శ్రమించినా రాని గుర్తింపును... తన అద్భుతమైన ఎక్స్ ప్రెషన్స్ తో ఓ చిన్న వీడియో ద్వారా ప్రియ సొంతం చేసుకుంది. 'ఒరు అడార్ లవ్' మూవీ ప్రోమోను విడుదల చేయగా... అందులో ప్రియ ముఖ కవళికలు యూత్ ను తెగ ఆకట్టుకున్నాయి. దీంతో, రాత్రికి రాత్రే ఆమె పెద్ద సెలబ్రిటీ అయిపోయింది.

More Telugu News