bolla bulliramaiah: కేంద్ర మాజీ మంత్రి బోళ్ల బుల్లిరామయ్య మృతి!

షార్ట్స్‌లో చూడండి
కేంద్ర మాజీ మంత్రి, ఆంధ్రా షుగర్స్ ఎండీ, టీడీపీ నేత బోళ్ల బుల్లిరామయ్య మృతి చెందారు. ఆయన వయసు 91 సంవత్సరాలు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. 1926 జులై 9న తూర్పుగోదావరి జిల్లా తాటిపాకలో ఆయన జన్మించారు. 1984, 1991, 1996, 1999 ఎన్నికల్లో ఏలూరు నుంచి ఆయన ఎంపీగా గెలిచారు. 1996-98 మధ్య కాలంలో ఆయన కేంద్ర వాణిజ్యశాఖ సహాయమంత్రిగా పని చేశారు. ఆయన మృతి పట్ల పలువురు నేతలు సంతాపం ప్రకటించారు.  
Go Back to Shorts
bolla bulliramaiah
death
Telugudesam
eluru mp

More Telugu News