వీటికి ఆధార్ అనుసంధానం అవసరం లేదు: యూఐడీఏఐ
- ఆధార్ లేదనే కారణంతో ప్రజలకు ఏ లబ్దినీ తిరస్కరించడానికి వీల్లేదు
- వైద్యం, పాఠశాలల్లో ప్రవేశం, రేషన్ పంపిణీలకు ఆధార్ అవసరం లేదు
- ప్రభుత్వ శాఖలకు యూఏడీఏఐ లేఖలు
ఆధార్ ను అనుసంధానం చేయలేదనే కారణంతో ప్రజలకు అందించే ఏ లబ్దినీ తిరస్కరించడానికి వీల్లేదని యూఐడీఏఐ స్పష్టం చేసింది. అత్యవసర వైద్యం, పాఠశాలల్లో ప్రవేశం, రేషన్ పంపిణీలకు సంబంధించి ఆధార్ కార్డు లేకపోయినా తిరస్కరించవద్దని ఆదేశించింది. లబ్దిదారుల గుర్తింపుకు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వ శాఖలు, పరిపాలనా విభాగాలకు లేఖలు రాసింది.