rajanikanth: దర్శకుడి కుమారుడి వివాహంలో రజనీకాంత్ కుటుంబం సందడి!

  • దర్శకుడు మహేంద్ర కుమారుడు హర్షవర్థన్ వివాహం  
  • సతీమణి లత, కుమార్తెలు ఐశ్వర్య, సౌందర్య, అల్లుడు ధనుష్ తో కలిసి హాజరైన రజనీ
  • నాడు రజనీ పెళ్లి విషయంలో సాయం చేసిన మహేంద్ర 
ప్రముఖ తమిళ తమిళ దర్శకుడు వైజీ మహేంద్ర కుమారుడు హర్షవర్థన్ పెళ్లి ఈరోజు తెల్లవారుజామున చెన్నయ్ లో జరిగింది. ఈ వివాహ మహోత్సవానికి సూపర్ స్టార్ రజనీకాంత్ దంపతులు హాజరయ్యారు. రజనీతో పాటు ఆయన సతీమణి లత, కుమార్తెలు ఐశ్వర్య, సౌందర్య, అల్లుడు ధనుష్ వెళ్లారు. పెళ్లి వేడుకలో రజనీ కుటుంబం సందడి చేసింది.  

కాగా, రజనీ సతీమణి లతకు దర్శకుడు మహేంద్ర బంధువు అవుతారు. నాడు రజనీకాంత్ కు లత ను ఇచ్చి పెళ్లి చేసేందుకు ఆమె తల్లిదండ్రులను ఒప్పించింది మహేంద్రనట. మరో ఆసక్తికరమైన విషయమేంటంటే, మహేంద్రకు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ వరుసకు సోదరుడవుతారని సమాచారం. 
rajanikanth
director mahendra

More Telugu News