russia: కుప్పకూలిన రష్యా విమానం..71 మంది మృతి!

  • బయలుదేరిన కొద్ది సేపటికే ఏటీసీతో తెగిపోయిన సంబంధాలు
  •  అర్గునోవ్ అనే గ్రామం సమీపంలో కుప్పకూలిన విమానం
  •  సంతాపం ప్రకటించిన రష్యా అధ్యక్షుడు పుతిన్
రష్యాకు చెందిన విమానం బయలుదేరిన కొద్ది సేపటికే కుప్పకూలిన సంఘటనలో 71 మంది మృతి చెందినట్టు సమాచారం. సరటోవ్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఏఎన్ 148 రకపు విమానం మాస్కోలోని డుమోడెడ్వో అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన కొద్ది సేపటికే ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. అర్గునోవ్ అనే గ్రామం సమీపంలో కూలిపోయింది.

ఓరస్క్ నగరానికి బయలుదేరిన ఈ విమానంలో మొత్తం 71 మంది ఉన్నారు. ఈ ప్రమాదంలో 71 మంది మృతి చెందినట్టు సమాచారం. కాగా, ఈ ప్రమాద సంఘటనను అధికారులు ధ్రువీకరించారు. సహాయక బృందాలు ఘటనా స్థలానికి బయల్దేరాయి. ఈ సంఘటనపై రష్యా ప్రభుత్వం దర్యాప్తును ప్రారంభించింది. కాగా, ఈ విషాద సంఘటనపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంతాపం తెలిపారు.
russia
sartov air lines
accident

More Telugu News