kvp: కాంగ్రెస్ పై ప్రధాని మోదీ అసత్యాలు మాట్లాడారు: ఎంపీ కేవీపీ

  • నాటి నాయకుడు అంజయ్యను మా పార్టీ అవమానించిందనడం అవాస్తవం
  • మాజీ ప్రధాని పీవీకి కూడా కాంగ్రెస్ పార్టీ  సహకరించింది 
  • రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు పనికిరాని డాక్యుమెంట్స్ ని బీజేపీ ఇచ్చింది: కేవీపీ
కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ లోక్ సభలో ప్రధాని మోదీ ఇటీవల చేసిన ప్రసంగంపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు మాట్లాడుతూ, కాంగ్రెస్ గురించి మోదీ మాట్లాడిన మాటలన్నీ అసత్యాలని, నాటి నాయకుడు అంజయ్యను తమ పార్టీ అవమానించిందనడం అవాస్తవమని అన్నారు.

అలాగే, అంజయ్యను కాంగ్రెస్ పార్టీ ఎంతో గౌరవప్రదంగా చూసిందని, అదే విధంగా మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కూడా కాంగ్రెస్ పార్టీ మంచి సహకారమిచ్చిందని, కాంగ్రెస్ ప్రోత్సాహంతో ఏపీకి పీవీ ఎంతో మేలు చేశారని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర విభజన అంశాన్ని ప్రస్తావిస్తూ, రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు పనికిరాని డాక్యుమెంట్స్ ని బీజేపీ ఇచ్చిందని, కాంగ్రెస్ పాత్ర కన్నా బీజేపీ పాత్ర చాలా పెద్దదని అన్నారు.
kvp
Congress
Andhra Pradesh

More Telugu News