India: 'పింక్ మ్యాచ్' అంటే ఓటమెరుగని సౌతాఫ్రికా!

  • రొమ్ము క్యాన్సర్ పై అవగాహన పెంచుతున్న దక్షిణాఫ్రికా
  • ఇప్పటివరకూ ఆరు మ్యాచ్ లు ఆడి, అన్నింటా గెలిచిన జట్టు
  • స్టేడియమంతా గులాబీమయం

మహిళల్లో రొమ్ము క్యాన్సర్ పై అవగాహన పెంచేలా, ప్రతి సంవత్సరమూ ఓ మ్యాచ్ గులాబీ రంగు దుస్తులు ధరించి ఆడే దక్షిణాఫ్రికా, చరిత్రలో ఇంతవరకూ ఆ మ్యాచ్ లను ఓడిపోలేదు. వరుసగా మూడు మ్యాచ్ లను చేజార్చుకోవడం, కీలక ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడంతో ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తుందా? అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయినప్పటికీ, తమ ఆనవాయితీని కొనసాగిస్తూ, ఈ మ్యాచ్ ని దక్షిణాఫ్రికా గెలిచింది.

ఈ మ్యాచ్ తో కలిపి మొత్తం 6 మ్యాచ్ ల్లో సౌతాఫ్రికా పింక్ జర్సీలతో ఆడి, అన్నింటా గెలిచింది. ఆటగాళ్లు పింక్ జెర్సీలతో మైదానంలోకి దిగడంతో, ప్రేక్షకులు సైతం గులాబీ రంగు టోపీలు, టీ షర్టులు, ధరించి స్టేడియాన్ని పింక్ కలర్ లో ముంచెత్తారు. స్టేడియంలోని ప్రకటనలు కూడా అదే రంగులో కనిపించడం గమనార్హం. మొత్తం మీద దక్షిణాఫ్రికా ఈ మ్యాచ్ తో విజయాల బాట పట్టింది.

More Telugu News