union independent minister: భూకబ్జా కేసులో కేంద్ర మంత్రి గిరిరాజ్ పై కేసు నమోదు!

షార్ట్స్‌లో చూడండి
ఓ దళిత వ్యక్తికి చెందిన భూమిని కబ్జా చేసిన ఘటనలో కేంద్ర మంత్రి గిరిరాజ్ పేరును పోలీసులు ఎఫ్ఐఆర్ లో చేర్చారు. బీహార్ దానాపూర్ లోని ఓ స్థానిక కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఎఫ్ఐఆర్ లో కేంద్ర మంత్రి పేరును చేర్చారు. కేసు వివరాల్లోకి వెళ్తే రామ్ నారాయణ్ ప్రసాద్ అనే వ్యక్తికి చెందిన భూమి కబ్జాకు గురైంది. తప్పుడు సంతకాలతో, అధికారుల అండతో ఈ భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. దీనికి సంబంధించి బాధితుడు కోర్టును ఆశ్రయించాడు. ఈ క్రమంలో కోర్టు ఆదేశాలతో ఎఫ్ఐఆర్ లో 25వ నిందితుడిగా కేంద్ర మంత్రి పేరును చేర్చారు.

ఈ కేసుపై గిరిరాజ్ స్పందిస్తూ ఆ ప్రాంతంలో తాను ఒక స్థలాన్ని కొన్నానని... ఒరిజినల్ ల్యాండ్ ఓనర్ ద్వారానే ఆ భూమిని కొనుగోలు చేశానని చెప్పారు. ఆ భూమి ఫిర్యాదుదారుడిది కాదని అన్నారు. ఎఫ్ఐఆర్ లో కేంద్ర మంత్రి పేరు చేర్చడంతో నితీష్ కుమార్ ప్రభుత్వంపై ఆర్జేడీ విమర్శలకు దిగింది. బీజేపీ మిత్రపక్షంగా ఉన్న నితీష్ కుమార్ ఇప్పుడు ఈ కబ్జా వ్యవహారంపై ఏం మాట్లాడతారని మాజీ డిప్యూటీ సీఎం తేజశ్వి యాదవ్ ప్రశ్నించారు. గిరిరాజ్ రాజీనామాను నితీష్ కోరగలరా? అంటూ ఎద్దేవా చేశారు.
Go Back to Shorts
union independent minister
giriraj
land grab case
fir

More Telugu News