ashes: కలకలం.. యాషెస్ లో ఫిక్సింగ్.. రెండు సెషన్లకు రూ. 120 లక్షలు

  • డిసెంబర్ లో జరిగిన మూడో టెస్ట్ లో ఫిక్సింగ్
  • మ్యాచ్ ఫిక్సింగ్ కు యత్నించిన భారత బుకీ
  • ఫిక్సింగ్ జరగలేదన్న ఐసీసీ

అంతర్జాతీయ క్రికెట్ లో అలజడి చెలరేగింది. ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగే యాషెస్ సిరీస్ లో ఫిక్సింగ్ జరిగింది. గత డిసెంబర్ లో పెర్త్ లో జరిగిన మూడో టెస్ట్ లో ఆటగాళ్లు స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడ్డాని 'ది సన్' పత్రిక ప్రచురించింది. దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు ఐసీసీ వద్ద ఉన్నాయని తన కథనంలో పేర్కొంది. అంతేకాదు రహస్య విచారణకు ఐసీసీ ఆదేశించినట్టు తెలిపింది. భారత్ కు చెందిన బుకీ మ్యాచ్ ఫిక్సింగ్ కు ప్రయత్నించారని ఆరోపించింది. ఒక్క సెషన్ కు రూ. 60 లక్షలు, రెండు సెషన్లకు రూ. 120 లక్షల చొప్పున బుకీలు బేరాలు ఆడినట్టు పేర్కొంది.

అయితే దీనిపై ఐసీసీ స్పందిస్తూ ఆటగాళ్లు, స్టాఫ్ ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని తెలిపింది. యాషెస్ ఫిక్సింగ్ పై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపామని ఐసీసీ అవినీతి నిరోధక శాఖ జనరల్ మేనేజర్ అలెక్స్ మెర్షల్ వెల్లడించారు. ఆటగాళ్లు, జట్టు సభ్యులు, కోచ్, సహాయకులు ఇలా ప్రతి ఒక్కరిని విచారించామని చెప్పారు. ఫిక్సింగ్ కు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలిపారు. 

More Telugu News