పార్లమెంటులో ఊహించని పరిణామం.. టీడీపీ ఎంపీలతో సోనియా మంతనాలు!
- ఏపీ పరిణామాలపై ఆరా
- పరిస్థితిని వివరించిన టీడీపీ ఎంపీలు
- లోక్ సభలో ఆసక్తికర పరిణామం
మరోవైపు, ఇదే సమావేశాల్లో ఏపీకి ఈ పరిస్థితి తలెత్తడానికి కారణం కాంగ్రెస్ పార్టీనే అంటూ టీడీపీ ఎంపీలు ఆరోపించారు. మరోవైపు, కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ మల్లికార్జున ఖర్గే ప్రసంగిస్తుండగా, ఆయన ఎదుట ప్లకార్డులు పట్టుకుని, నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఖర్గే పక్కనే సోనియా కూర్చున్నారు. ఆ సందర్భంగా టీడీపీ ఎంపీలపై ఖర్గే అసహనం వ్యక్తం చేసినా, సోనియా మాత్రం ప్రశాంతంగానే ఉన్నారు.