Congress: రేపు ర‌ఘువీరారెడ్డి హిందూపురంలో బంద్‌లో పాల్గొంటారు: మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్ర‌రాజు

  • రేపు ఏపీ బంద్‌లో అందరూ పాల్గొనాలి
  • ఆనాడు ఏపీ ప్రయోజనాలపై సోనియా గాంధీ కేంద్ర సర్కారుకి లేఖ రాశారు
  • రాహుల్ గాంధీ కూడా ఏపీ గురించి మాట్లాడారు

ప్ర‌త్యేక హోదాతో పాటు విభ‌జ‌న బిల్లులోని అంశాల‌న్నిటినీ అమ‌లు చేయాల‌ని డిమాండ్ చేస్తూ, కాంగ్రెస్ పార్టీ రేపు నిర్వ‌హించే ఏపీ బంద్‌ను విజ‌య‌వంతం చేయాల‌ని మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్ర‌రాజు పిలుపు నిచ్చారు. ఎన్డీయే ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన చివరి బ‌డ్జెట్‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు దారుణ‌మైన అన్యాయం జ‌రిగింద‌న్నారు. ఈ అన్యాయాన్ని నిర‌సిస్తూ ఈ నెల 8న బంద్‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ పిలుపునిచ్చింద‌న్నారు. ఈ మేర‌కు ఏపీసీసీ అధ్య‌క్షుడు ర‌ఘువీరారెడ్డి అనంత‌పురం జిల్లాలోని హిందుపురంలో రేపు బంద్‌లో పాల్గొంటార‌న్నారని చెప్పారు.

అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కేంద్ర, రాష్ట్ర మాజీ‌ మంత్రులు ఆయా ప్రాంతాల్లో జ‌రిగే బంద్ లో భాగ‌స్వామ్యం అయి.. బంద్‌ను విజ‌య‌వంతం చేయాల‌ని కోరారు. రాష్ట్ర భ‌విష్య‌త్ కోసం ప్ర‌త్యేక హోదా అమ‌లుతో పాటు సుమారు 5 ల‌క్ష‌ల కోట్ల విలువ చేసే ప్ర‌యోజ‌నాల‌ను చ‌ట్ట‌బ‌ద్ధం చేసిందని అన్నారు. ఎన్డీయే ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన మొద‌టి నెలలోనే (2014 జూన్‌-2) అప్పటి కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు సోనియాగాంధీ ఏపీకి న్యాయం చేయాల‌ని తొలి లేఖ రాశారని అన్నారు.

అలాగే, 2015 మార్చి 16న లోక్‌స‌భ‌లో సోనియాగాంధీ ఏపీకి న్యాయం చేయాల‌ని మాట్లాడారని తెలిపారు. రాహుల్ గాంధీ కూడా ఏపీకి న్యాయం చేయాల‌ని ప్ర‌ధానికి లేఖ రాశార‌ని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఏపీ ప్ర‌యెజ‌నాల కోసం పోరాడుతుంద‌న్నారు. రేపు జ‌రిగే రాష్ట్ర బంద్‌ను విజ‌య‌వంతం చేయాల‌ని కాంగ్రెస్ శ్రేణుల‌కు, ప్ర‌జాస్వామ్య‌వాదుల‌కు రుద్రరాజు పిలుపు నిచ్చారు.

More Telugu News