దేశ ప్రజలు ఇలాంటి ఉపన్యాసాలు కోరుకోవడం లేదు: మోదీ ప్రసంగంపై సోనియాగాంధీ ఫైర్
- మోదీ ప్రసంగంలో కొత్తదనమేమీ లేదు
- జనాలకు ఉపాధి కావాలి
- ఇలాంటి ప్రసంగాలు అవసరం లేదు
తర్వాత మోదీ ప్రసంగంపై కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్పందించారు. మోదీ ప్రసంగం ఎప్పట్లాగానే ఉందని, అందులో కొత్తదనమేమీ లేదని ఎద్దేవా చేశారు. యువతకు ఉపాధి అవకాశాల గురించి మోదీ ప్రస్తావించలేదని అన్నారు. తమ భవిష్యత్తుపై ప్రజలు కోటి ఆశలు పెట్టుకున్నారని చెప్పారు. దేశ ప్రజలు ఉపాధిని కోరుకుంటున్నారని... ఇలాంటి ఉపన్యాసాలకు కాదని సెటైర్ వేశారు.