Pilot: ఆ వార్తల్లో నిజం లేదు.. ఉగ్రవాదులకు చిక్కకుండా తనను తాను పేల్చేసుకున్న పైలట్!

  • సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో
  • ఉగ్రవాదులతో చివరి వరకు పోరాడాడన్న రష్యా
  • మరణానంతం ‘హీరో ఆఫ్ ది రష్యా’ అవార్డు

ఇటీవల సిరియాలో రష్యా విమానాన్ని కూల్చేసిన ముష్కరులు పైలట్‌ను దారుణంగా చంపేసినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల్లో ఎంత మాత్రమూ నిజం లేదని తేలింది. ఉత్తర ఇడ్లిబ్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో బయటకు వచ్చి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రష్యాకు చెందిన ఎస్‌యూ-25 అనే యుద్ధ విమానాన్ని హయత్ తెహ్రిర్ అల్-ష్యామ్ (హెచ్‌టీఎస్) అనే ఉగ్రవాద సంస్థ క్షిపణుల ద్వారా నేల కూల్చింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పైలట్ మేజర్ ఫిల్ఫ్వో (33) పారాచూట్ సాయంతో తప్పించుకుని కిందికి దిగాడు. గమనించిన ఉగ్రవాదులు ఆయనను చుట్టుముట్టడంతో వారికి చిక్కడం ఇష్టంలేని పైలట్ తన చేతిలో ఉన్న గ్రనేడ్‌ను పేల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

యుద్ధ విమానాన్ని సిరియా తిరుగుబాటు దళాలు నేలకూల్చినట్టు రష్యా పేర్కొంది. పోర్టబుల్ యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ మిసైల్‌తో విమానాన్ని కూల్చినట్టు తెలుస్తోందని రష్యన్ వర్గాలు తెలిపాయి. ఉగ్రవాదులతో పోరాడి పైలట్ ప్రాణాలు కోల్పోయినట్టు పేర్కొన్నాయి. ముష్కరులతో చివరి వరకు పోరాడిన పైలట్ వారికి చిక్కకుండా తనను తాను పేల్చుకున్నట్టు వివరించాయి. పైలట్‌ ఫిల్ఫ్వోకు ‘ది హీరో ఆఫ్ ది రష్యా’ అవార్డును ప్రభుత్వం ప్రకటించింది.

More Telugu News