sai dharam tej: చిరూ సాంగ్ రీమిక్స్ కంగారు పెట్టేసింది: లావణ్య త్రిపాఠి

  • వినాయక్ దర్శకత్వంలో 'ఇంటిలిజెంట్'
  • తేజు సరసన లావణ్య త్రిపాఠి
  • 'ఛమక్ ఛమక్ ఛామ్'సాంగ్ రీమిక్స్   

లావణ్య త్రిపాఠి తాజా చిత్రంగా రూపొందిన 'ఇంటిలిజెంట్' .. ఈ నెల 9వ తేదీన ప్రేక్షకులను పలకరించనుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. ఈ సందర్భంగా లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ .. "ఈ సినిమాలో నా పాత్ర పేరు 'సంధ్య' .. యూఎస్ లో చదువుకుని వచ్చి .. బిజినెస్ లో తండ్రికి సహాయపడుతూ వుంటాను. కొంచెం కోపంగా కనిపించే ఈ పాత్రను వినాయక్ గారు నాతో అద్భుతంగా చేయించారు"

"ఈ మధ్య కాలంలో నాకు బాగా సంతృప్తిని ఇచ్చిన పాత్ర ఇది. చిరంజీవిగారి 'కొండవీటి దొంగ' సినిమాలోని 'ఛమక్ ఛమక్ ఛామ్' సాంగును రీమిక్స్ చేశారు. ఈ సాంగ్ ను రీమిక్స్ చేస్తున్నారు అనగానే చాలా కంగారుపడిపోయాను. చిరంజీవి .. విజయశాంతి స్థాయిలో చేయడం సాధ్యం కాదనిపించింది. తేజు జోడీగా నా స్థాయిలో నేను ఈ రీమిక్స్ కి న్యాయం చేయడానికి ప్రయత్నించాను" అని చెప్పుకొచ్చింది.   

More Telugu News