maldives: మాల్దీవుల్లో సంక్షోభం... అధ్యక్షుడిని అభిశంసించే యోచనలో సుప్రీంకోర్టు

  • సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేసిన అధ్యక్షుడు
  • దాంతో అభిశంసించే అవకాశం ఉందన్న అటార్నీ జనరల్
  • ఈ ఆదేశాలను గౌరవించొద్దంటూ అన్ని సంస్థలకు సూచన

మాల్దీవుల్లో సంక్షోభం నెలకొంది. ప్రతిపక్ష నాయకులను విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను దేశాధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ అమలు చేయలేదు. దీంతో ఆయన్ను అధ్యక్ష పదవి నుంచి అభిశంసించే ఆలోచనలో సుప్రీంకోర్టు ఉంది. ఒకవేళ సుప్రీంకోర్టు అధ్యక్షుడిని అభిశంసిస్తూ ఆదేశాలు ఇస్తే వాటిని గౌరవించొద్దంటూ అటార్నీ జనరల్ అన్ని జాతీయ సంస్థలను, రక్షణ విభాగాలను కోరారు.

‘‘జరుగుతున్న పరిణామాలు జాతీయ భద్రతా సంక్షోభానికి దారితీస్తాయన్న సమాచారం మాకు అందింది’’ అని అటార్నీ జనరల్ అనిల్ మాలేలో ఈ రోజు మీడియాకు తెలిపారు. సుప్రీంకోర్టు అధ్యక్షుడిని అభిశంసిస్తూ ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉందన్నదే ఆ సమాచారంగా పేర్కొన్నారు. రాజ్యాంగ పరిధిలో ఈ ఆదేశాలను అమలు చేసేందుకు ఏ ప్రభుత్వం సంస్థకు అధికారం ఇవ్వలేదని స్పష్టం చేశారు.

More Telugu News