medaram: నేటితో ముగియనున్న మేడారం జాతర

  • చివరి రోజు కావడంతో పోటెత్తిన భక్తులు
  • అమ్మవార్లు వన ప్రవేశంతో ముగియనున్న జాతర
  • వీఐపీల తాకిడితో దర్శనం ఆలస్యమవుతోందంటూ భక్తుల విమర్శలు

నేటితో మేడారం జాతర ముగియనుంది. చివరిరోజు కావడంతో భక్తులతో మేడారం కిక్కిరిసిపోయింది. అమ్మవార్లు వన ప్రవేశం చేయడం ద్వారా జాతర ముగియనుంది. కాగా, గత నెల 31న మేడారం జాతర ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర పండగ అయిన మేడారం జాతరకు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర నుంచి భక్తులు తరలివచ్చారు.

ఈ జాతరకు వీఐపీల తాకిడి కారణంగా తమకు దర్శనం ఆలస్యమవుతోందని భక్తులు విమర్శిస్తున్నారు. కేవలం వీఐపీల తాకిడే కాకుండా, అధికారుల సమన్వయం లోపం కొట్టొచ్చినట్టు కనబడుతోందని పలువురు భక్తులు ఆరోపించారు. సీఎం కేసీఆర్ తన కుటుంబంతో నిన్న మేడారం సందర్శించి మొక్కులు తీర్చుకున్నారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, స్పీకర్ మధుసూదనాచారి, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తదితరులు వనదేవతలను నిన్న సందర్శించుకున్నారు.

More Telugu News