Under-19 world cup: అండర్-19 ప్రపంచకప్ ఫైనల్: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా

  • ఆరుసార్లు ఫైనల్‌కు చేరిన భారత్
  • మూడుసార్లు విశ్వవిజేతగా ఆవిర్భావం
  • బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ రంగాల్లో బలంగా ఉన్న పృథ్వీ షా సేన

న్యూజిలాండ్‌లో జరుగుతున్న అండర్-19 ప్రపంచకప్‌ ఫైనల్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. బే ఓవల్‌ వేదికగా జరుగుతున్న ఈ పోరులో నెగ్గి విశ్వవిజేత కావాలని ఇరు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. ఆరుసార్లు ప్రపంచకప్ ఫైనల్ చేరిన భారత్ మూడుసార్లు విశ్వవిజేతగా నిలిచింది. ఆస్ట్రేలియా కూడా మూడుసార్లు ప్రపంచకప్ గెలుచుకుంది. ఇక బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ రంగాల్లో బలంగా ఉన్న రాహుల్ ద్రవిడ్ టీం గ్రూపు పోరులో ఆస్ట్రేలియాను వంద పరుగుల తేడాతో చిత్తు చేసింది. మరోవైపు తొలి మ్యాచ్‌లో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని  ఆసీస్ భావిస్తోంది. దీంతో పోరు రసవత్తరంగా జరిగే అవకాశం ఉంది.  

భారత జట్టు: పృథ్వీషా (కెప్టెన్), మన్‌జోత్ కల్రా, శుభ్‌మన్ గిల్, హార్విక్ దేశాయ్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్,  అభిషేక్ శర్మ, అనుకూల్ రాయ్, కమలేశ్ నాగర్‌కోటి, శివం మావి, శివ సింగ్, ఇషాన్ పోరెల్.

ఆస్ట్రేలియా జట్టు: జాక్ ఎడ్వర్డ్స్, మాక్స్ బ్రయాంట్, జాసన్ సంఘ (కెప్టెన్), జొనాథన్ మెర్లో, పరమ్ ఉప్పల్, నాథన్ మెక్ స్వీనీ, విల్  సూథర్‌లాండ్, బాక్స్‌టర్ జె హోల్ట్ (వికెట్ కీపర్), జాక్ ఎవాన్స్, ర్యాన్ హాడ్లీ, లాయిడ్ పోప్.

More Telugu News