Meenakshi temple: తమిళనాడు మధుర మీనాక్షి ఆలయంలో భారీ అగ్నిప్రమాదం.. 50 దుకాణాలు దగ్ధం.. ఉద్రిక్తత

  • ఆలయం మూసేసిన తర్వాత ప్రమాదం
  • వేయికాళ్ల మండపంలో చెలరేగిన మంటలు
  • ఆలయం వద్ద ఉద్రిక్తత

తమిళనాడు, మధురైలోని మీనాక్షి ఆలయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వెయ్యికాళ్ల మంటపం వద్ద జరిగిన ప్రమాదంలో 50కిపైగా దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు వేలాదిగా చేరుకున్నారు. భద్రతా లోపం కారణంగా ప్రమాదం జరిగిందని ఆరోపిస్తూ అధికారుల వాహనాలపై రాళ్లు రువ్వారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు ఆలయాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. చుట్టుపక్కల విద్యుత్ సరఫరాను నిలిపివేసిన పోలీసులు, ఆలయంలోకి ఎవరినీ అనుమతించడం లేదు.

ప్రమాదంలో 50 దుకాణాలు దగ్ధమయ్యాయని కలెక్టర్ వీర రాఘవరావు తెలిపారు. ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని పేర్కొన్నారు. ఆలయం మూసివేసిన తర్వాత అర్ధరాత్రి వేయికాళ్ల మండపం వద్ద మంటలు చెలరేగినట్టు తెలిపారు. పూజా సామగ్రి అంటుకోవడం వల్లే ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక శకటాలు ప్రయత్నిస్తున్నాయి.

More Telugu News