vinod kambli: వినోద్ కాంబ్లీకు పితృవియోగం!

  • ఇన్నాళ్లూ నా వెన్నంటి ఉన్న నా తండ్రి గణ్ పత్ ఇకలేరు
  • నాన్నా, మిమ్మల్ని మిస్సయ్యా
  • ఓ ట్వీట్ లో కాంబ్లీ ఆవేదన
టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ తండ్రి గణ్ పత్ నిన్న తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని కాంబ్లీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. ‘ఇన్నాళ్లూ నా వెన్నంటి ఉన్న, నేను క్రికెట్ ఆడేందుకు స్ఫూర్తి నిచ్చిన, నన్ను ప్రోత్సహించిన నా తండ్రి గణ్ పత్ ఇకలేరు. ఈరోజు ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. నాన్నా, మిమ్మల్ని మిస్సయ్యా..’ అని తన తండ్రిపై ప్రేమను కాంబ్లీ చాటుకున్నారు. ఈ సందర్భంగా తన తండ్రి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఇందుకు సంబంధించిన ఫొటోలను కాంబ్లీ పోస్ట్ చేశాడు. 
vinod kambli
Cricket

More Telugu News