Padmaavat: విదేశాల్లో మార్మోగుతున్న 'ప‌ద్మావ‌త్‌' పాట‌... ఎన్‌బీఏ మ్యాచ్‌లో 'ఘూమ‌ర్' పాట‌కు డ్యాన్స్‌... వీడియో!

  • చ‌క్క‌గా నృత్యం చేసిన విదేశీయులు
  • ఈ పాట‌పై డ్యాన్స్ చేయ‌డాన్ని నిషేధించిన కొన్ని రాష్ట్రాలు
  • వైర‌ల్ అవుతున్న వీడియో

'ప‌ద్మావ‌త్' సినిమాపైనే కాదు.. ఆ చిత్రంలోని 'ఘూమ‌ర్' పాట‌పై కూడా తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. రాజ‌స్థానీ నృత్య క‌ళ‌ను చ‌క్క‌గా కొరియోగ్ర‌ఫీ చేసిన ఈ పాట‌కు డ్యాన్స్ చేయ‌డానికి అమ్మాయిలు ఆస‌క్తి చూపిస్తున్నారు. కానీ కొన్ని రాష్ట్రాలు ఈ పాట‌కు డ్యాన్స్ చేయ‌డాన్ని తమ తమ రాష్ట్రాలలో నిషేధించాయి.

అయితే, విదేశాల్లో మాత్రం ఈ పాట మార్మోగిపోతోంది. అవును... అమెరికాలో నేష‌న‌ల్ బాస్కెట్‌బాల్ అసోసియేష‌న్ (ఎన్‌బీఏ) నిర్వ‌హించిన పోటీల ప్రారంభ కార్య‌క్ర‌మంలో ఈ పాట‌కు విదేశీ చీర్‌లీడ‌ర్లు నృత్యం చేసి అంద‌రినీ ఆక‌ట్టుకున్నారు. షార్లెట్ హార్నెట్స్‌, మ‌యామీ హీట్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ ప్రారంభానికి ముందు ఈ నృత్యాన్ని ప్ర‌ద‌ర్శించారు. ఈ వీడియోను ఎన్‌బీఏ త‌మ అధికారిక ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

More Telugu News