polavaram: ఢిల్లీలో పోలవరంపై ముగిసిన చర్చ.. కీలక ఆదేశాలు జారీ చేసిన నితిన్ గడ్కరీ

  • భేటీలో పాల్గొన్న రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు, గుత్తేదారులు
  • స్పిల్ వే, స్పిల్ ఛానెల్ పనులు నవయుగ కంపెనీకి అప్పగింతకు ఆదేశాలు
  • పోలవరం నిర్ణీత సమయంలో పూర్తి చేయాలి: నితిన్ గడ్కరీ
ఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ కార్యాలయంలో పోలవరంపై సమావేశం ముగిసింది. దాదాపు రెండు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ.. ఏపీ జలవనరుల శాఖ అధికారులు, గుత్తేదారులకు కీలక ఆదేశాలు చేశారు. స్పిల్ వే, స్పిల్ ఛానెల్ పనులు నవయుగ కంపెనీకి అప్పగించడానికి గడ్కరీ అంగీకారం తెలిపారు. ఆ సంస్థతో ఈ మేరకు ఒప్పందం చేసుకుని, పోలవరం పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మరో వారం రోజుల్లో  స్పిల్ వే, స్పిల్ ఛానెల్ పనులు నవయుగ కంపెనీకి అప్పగించే ప్రక్రియ ముగియనున్నట్లు తెలిసింది. 
polavaram
New Delhi
nitin gadkari

More Telugu News