Tollywood: నా కూతురుకి ప్రాణహాని ఉంది: సామ్రాట్ రెడ్డి మామ కృష్ణారెడ్డి

  • సినిమాల్లో నటించనని చెప్పిన తర్వాతే సామ్రాట్ కు మా అమ్మాయిని ఇచ్చాం
  • ఆ ఒప్పందాన్ని పక్కనపెట్టాడు
  • అదనపు కట్నం కోసం వేధించేవాడు: కృష్ణారెడ్డి
భార్య హర్షితారెడ్డిని వేధించిన కేసులో సినీ నటుడు సామ్రాట్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయమై హర్షితారెడ్డి తండ్రి కృష్ణారెడ్డి మాట్లాడుతూ, తన కూతురికి ప్రాణహాని ఉందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. సినిమాల్లో నటించనని సామ్రాట్ చెప్పిన తర్వాతే తన కూతురిని అతనికి ఇచ్చి పెళ్లి చేశామని, అయితే, ఆ ఒప్పందాన్ని అతను పక్కనపెట్టాడని అన్నారు.

 తన కూతురు పేరిట ఉన్న ఆస్తులను అతని పేరు మీదకు బదలాయించాలని ఒత్తిడి తెచ్చాడని, అంతేకాకుండా, అదనపు కట్నం కోసం వేధించాడని ఆరోపించారు. అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడంటూ రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లో గత నవంబర్ 30న ఫిర్యాదు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ఈ నెల 25న తన కూతురు ఇంట్లో లేని సమయం చూసి తాళాలు పగులగొట్టి విలువైన వస్తువులను సామ్రాట్ రెడ్డి చోరీ చేశాడని ఆయన ఆరోపించారు.
Tollywood
samrat reddy

More Telugu News