Samrat Reddy: నా భర్త చాలా దుర్మార్గుడు, సైకో: నటుడు సామ్రాట్ రెడ్డిపై హర్షిత ఆరోపణలు

  • పెళ్లి తరువాత నిజస్వరూపం తెలిసింది
  • సైకోలా మారి చిత్రహింసలు పెట్టేవాడు
  • సామ్రాట్ రెడ్డి భార్య హర్షిత ఆరోపణలు
తన భర్తను ఎంతో ఇష్టపడి వివాహం చేసుకున్నానని, అయితే, ఆ తరువాతే అతని నిజస్వరూపం తెలిసిందని నటుడు సామ్రాట్ రెడ్డి భార్య హర్షిత ఆరోపించింది. మాదాపూర్ పోలీసులు సామ్రాట్ ను అరెస్ట్ చేసిన తరువాత మీడియాతో మాట్లాడిన ఆమె, తన భర్త చాలా దుర్మార్గుడని సంచలన ఆరోపణలు చేసింది. తప్పనిసరి పరిస్థితుల్లోనే తాను కేసు పెట్టానని వెల్లడించింది.

ఎంతో సహనంగా, ఎన్ని కష్టాలు పెట్టినా ఇన్నాళ్లూ మౌనంగా ఉన్నానని, కానీ ఓ సైకోలా మారి తీవ్రంగా హింసిస్తుండటంతో విధిలేని పరిస్థితుల్లోనే దూరంగా ఉండిపోయానని వాపోయింది. వాస్తవానికి సినీ నటుడిని పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేకున్నా, ఆ రంగం నుంచి బయటకు వస్తానని సామ్రాట్ హామీ ఇవ్వడంతోనే అంగీకరించానని హర్షిత తెలిపింది. తన అత్త కూడా ఎంతో వేధించిందని ఆరోపించింది. కట్నం తీసుకురావాలని వేధిస్తున్నందునే గతంలో ఓ కేసు పెట్టానని చెప్పింది. ఇప్పుడు తాజాగా గృహోపకరణాలను, పలు విలువైన వస్తువులను చెప్పకుండా తీసుకు వెళ్లాడని తెలిపింది.
Samrat Reddy
Harshita
Marriage
Harrasment

More Telugu News