meka venkata pratap: నా ప్రాణం పోయినా టీడీపీలోకి వెళ్లను: వైసీపీ నూజివీడు ఎమ్మెల్యే మేకా

  • శరీరాన్ని ముక్కలు చేసినా పార్టీ మారను
  • వైయస్ నాకు ఎంతో తోడ్పాటు అందించారు
  • జగన్ కు అండగా ఉండటం నా బాధ్యత
అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి తనకు అందించిన తోడ్పాటు చాలా గొప్పదని నూజివీడు వైసీపీ ఎమ్మెల్యే మేకా వెంకటప్రతాప్ అన్నారు. నూజివీడులో ఎవరూ చేయనంత అభివృద్ధిని తాను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే చేశానని చెప్పారు. ప్రాణం పోయినా తాను టీడీపీలో చేరనని తెలిపారు. వాక్ విత్ జగన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

మహానేత వైయస్ కుమారుడు జగన్ స్థాపించిన పార్టీలో కొనసాగడం తన బాధ్యత అని మేకా అన్నారు. తన శరీరాన్ని ముక్కలుగా కోసినా, తాను పార్టీ మారబోనని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలకు నిధులు కూడా రావడం లేదని ఆయన మండిపడ్డారు. తాను ప్రజల మనిషినని, ప్రజలతో మమేకమై ఉంటానని, వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలుస్తానని చెప్పారు. నూజివీడు అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు.
meka venkata pratap
Jagan
rajasekhara reddy
YSRCP
Telugudesam
nuziveedu mla

More Telugu News