Chandrababu: 14 ఏళ్ల వైష్ణవికి అరుదైన అవకాశం... అమరావతి బ్రాండ్ అంబాసిడర్ గా నియమించిన చంద్రబాబు

  • కృష్ణా జిల్లా ముదినేపల్లికి చెందిన వైష్ణవి
  • ఇప్పటికే అమరావతి నిర్మాణానికి లక్ష రూపాయల విరాళం
  • బాలికను అభినందించిన సీఎం చంద్రబాబు
9వ తరగతి చదువుతున్న 14 సంవత్సరాల విద్యార్థిని అంబుల వైష్ణవిని నవ్యాంధ్ర రాజధాని నగరం అమరావతికి అంబాసిడర్‌ గా నియమిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. సెక్రటేరియేట్ లో తనను కలిసిన వైష్ణవిని అభినందించిన ఆయన, ఇటువంటి బాలికలు ప్రతి ఒక్కరికీ ఆదర్శమని పేర్కొన్నారు.

 కృష్ణాజిల్లా ముదినేపల్లికి చెందిన వైష్ణవి, ఇప్పటికే అమరావతి నిర్మాణానికి తన వంతుగా లక్ష రూపాయల విరాళాన్ని అందజేసింది. తాను ఇప్పటివరకూ రూ. 4 లక్షలు ఖర్చు పెట్టి రెండు స్కూళ్లలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు ఈ సందర్భంగా వైష్ణవి వెల్లడించింది. అమరావతి అంబాసిడర్ గా వైష్ణవిని నియమిస్తున్నట్టు పేర్కొన్న చంద్రబాబు, ఆ బాలికకు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఇక ఇదే సమయంలో భర్తను కోల్పోయి అనాధగా మారిన అనంతపురం జిల్లాకు చెందిన సత్యనారాయణమ్మ అనే మహిళకు రూ. 2 లక్షల ఆర్థిక సాయం చేస్తున్నట్టు కూడా చంద్రబాబు ప్రకటించారు.
Chandrababu
Krishna District
Amaravati
Ambassedor

More Telugu News