Puri Jagannadh: పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో మళ్లీ చరణ్!

  • 'మెహబూబా' పనుల్లో పూరీ 
  • తదుపరి సినిమా చరణ్ తో  
  • నిర్మాతగా కె. ఎస్. రామారావు
చరణ్ ఫస్టు మూవీ 'చిరుత' సినిమాకి పూరీ జగన్నాథ్ దర్శకుడిగా వ్యవహరించాడు. ఈ సినిమాతో చరణ్ కి ఆయన తొలి సక్సెస్ ను ఇచ్చాడు. మళ్లీ ఇన్నాళ్లకు ఈ కాంబినేషన్లో ఒక సినిమా రూపొందనున్నట్టు తెలుస్తోంది. కె.ఎస్.రామారావు ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించనున్నాడు.

 ప్రస్తుతం చరణ్  .. బోయపాటితో చేస్తోన్న సినిమా సెట్స్ పై వుంది. ఈ సినిమా పూర్తయిన తరువాత ఆయన పూరీతో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నట్టు చెబుతున్నారు. కె.ఎస్. రామారావు .. పూరీ 'బుజ్జిగాడు' సినిమా తరువాత చేయనున్న సినిమా ఇది. ఇక పూరీ తాజాగా తన తనయుడు ఆకాశ్ తో 'మెహబూబా' సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రషెష్ చూసిన పూరీ సన్నిహితులు .. చాలా బాగా వచ్చిందని అంటున్నారట. త్వరలోనే ఈ సినిమా ప్రమోషన్స్ ప్రారంభం కానున్నాయి. ఈ సినిమాతో పూరీ తన తనయుడికి హిట్ ఇస్తాడేమో చూడాలి మరి.          
Puri Jagannadh
charan

More Telugu News