kajal: నాని 'అ!' సినిమా రిలీజ్ డేట్ ఖరారు

షార్ట్స్‌లో చూడండి
నాని నిర్మాతగా .. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో 'అ!' సినిమా రూపొందుతోంది. కాజల్ .. రెజీనా .. నిత్యామీనన్ .. ఈషా రెబ్బా .. అవసరాల .. మురళీ శర్మ .. ప్రధానమైన పాత్రలను పోషించారు. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్ కి .. టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను వచ్చేనెల 2వ తేదీన విడుదల చేయనున్నట్టు వార్తలు వచ్చాయి.

అయితే ఈ సినిమా విడుదలను ఫిబ్రవరి 16వ తేదీకి ఫిక్స్ చేశారు. అందుకు సంబంధించిన వెరైటీ పోస్టర్ ను వదిలారు. "అన్ని సినిమాలందు 'అ' సినిమా వేరయా .. విశ్వదాభి రామా ఫిబ్రవరి 16 రిలీజ్ రా మామా" అంటూ తాళపత్రాల రూపంలో కొత్తగా పోస్టర్ ను రిలీజ్ చేశారు. విభిన్నమైన కంటెంట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో, చేప పాత్రకు నాని .. చెట్టు పాత్రకు రవితేజ వాయిస్ ఇవ్వడం విశేషం. ఈ సినిమాతో నిర్మాతగానూ నాని సక్సెస్ ను అందుకుంటాడేమో చూడాలి.  
Go Back to Shorts
kajal
regina
nithya menon

More Telugu News