Hyderabad: బైక్ రేసింగ్‌లతో హోరెత్తిన కేబీఆర్ పార్కు.. పోలీసుల అదుపులో 20 మంది

  • రేసింగ్‌లతో భయభ్రాంతులకు గురైన వాహనదారులు
  • పోలీసులను తప్పించుకుంటూ స్కిట్‌లు
  • స్పీడ్ డంపర్లతో పట్టుకున్న పోలీసులు

బైక్, కార్ల రేసింగ్‌తో హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్కు హోరెత్తింది. భయంకరమైన శబ్దాలు, విస్తుగొలిపే వేగంతో వాహనదారులు, ప్రయాణికులను రేసర్లు హడలెత్తించారు. చార్మినార్, బంజారాహిల్స్, మల్కాజిగిరి, జూబ్లీహిల్స్‌కు చెందిన దాదాపు 20 మంది యువకులు పార్కు చుట్టూ రేసింగ్ నిర్వహిస్తూ పోలీసులకు చిక్కకుండా స్కిట్‌లు చేస్తూ ఇతర వాహనదారులను ఇబ్బందులకు గురిచేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ట్రాఫిక్ స్పీడ్ డంపర్లు ఏర్పాటు చేసి రేసర్లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి మూడు ఖరీదైన కార్లు, తొమ్మిది ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో ముగ్గురు బీటెక్ విద్యార్థులు ఉన్నారు. ఒకరికి లైసెన్సు కూడా లేదు. యువకుల తల్లిదండ్రులను పిలిపించి వారి సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించిన అనంతరం కోర్టులో హాజరు పరుస్తామని పోలీసులు తెలిపారు. మరోసారి రేసింగ్‌లకు పాల్పడబోమని లిఖితపూర్వకంగా కోర్టుకు రాసి ఇచ్చిన తర్వాతనే వారి వాహనాలను తిరిగి ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు.

More Telugu News