Kalaparti Venkataramana: పత్రి శిష్యుడి హత్యకేసు నిందితుడిని చంపేందుకు ప్రయత్నం!

  • నిన్న వెంకటరమణ దారుణ హత్య
  • కేసులో కీలపర్తి వెంకట రమణపై ఆరోపణలు
  • ఈ ఉదయం కత్తులతో కలపర్తిపై దాడి
  • పరిస్థితి విషమం
పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ వ్యవస్థాపకుడు సుభాష్ పత్రి శిష్యుడైన యోగా గురు వెంకటరమణను నడిరోడ్డుపై కత్తితో నరికి చంపిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు కీలపర్తి వెంకట రమణపై ఈ ఉదయం హత్యాయత్నం జరగడం విశాఖలో సంచలనం కలిగించింది.

ఓ పత్రికలో విలేకరిగా పనిచేస్తున్న కీలపర్తి ఇంటికి వచ్చిన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు, కత్తులతో దాడి చేశారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, తీవ్రంగా గాయపడిన ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కీలపర్తి వెంకట రమణ కేజీజీహెచ్ లో చికిత్స పొందుతుండగా, ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
Kalaparti Venkataramana
Vizag
Murder
Subhas Patri

More Telugu News