Pawan Kalyan: ప్రధాని వద్దకు వెళ్లబోతున్నా: పవన్ కల్యాణ్

  • సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యం
  • వెంటనే స్పందించాల్సిన సమస్యలపై ప్రధానికి వినతిపత్రం
  • పరిటాల సునీతతో భేటీ అనంతరం పవన్ కల్యాణ్
రాయలసీమ సమస్యల సత్వర పరిష్కారానికి ఓ మెమొరాండం తీసుకుని తాను ప్రధాని నరేంద్ర మోదీ వద్దకు వెళ్లనున్నానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం మంత్రి పరిటాల సునీత ఇంటికి వచ్చిన ఆయన, ఆమెతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు. తాను అనంతలో కేవలం మూడు రోజుల పర్యటనకు మాత్రమే పరిమితం కాలేదని, ఇకపై పదే పదే ఇక్కడికి వస్తానని చెప్పిన ఆయన, సీమ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యపైనా స్పందిస్తానని తెలిపారు.

తన టీమ్ ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లి, వాళ్ల సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేస్తోందని, వారిచ్చే రిపోర్టును బట్టి, వెంటనే స్పందించాల్సిన సమస్యల వివరాలు తీసుకుని మోదీ వద్దకు వెళతానని ఆయన తెలిపారు. సీమలోని ప్రతి జిల్లాకూ తాగు నీరు అందించడం తన తొలి లక్ష్యమని తెలిపారు. ఇదే సమావేశంలో పాల్గొన్న పరిటాల సునీత మాట్లాడుతూ, పవన్ తన ఇంటికి అతిథిగా రావడం ఆనందాన్ని కలిగించిందని తెలిపారు. జిల్లా సమస్యలన్నీ పరిష్కారమవుతున్నాయని, పవన్ ఇచ్చే సలహా, సూచనలనూ తీసుకుంటామని తెలిపారు.
Pawan Kalyan
Anantapur District
Paritala Sunita
Narendra Modi

More Telugu News