Tiranga Rally: అట్టుడుకుతున్న యూపీ... ఇంటర్నెట్ బంద్!

  • తిరంగా ర్యాలీలో 'జై పాకిస్థాన్' నినాదాలు
  • అల్లర్లు చెలరేగి యువకుడి మృతి
  • యూపీలోని కస్ గంజ్ జిల్లాలో ఉద్రిక్తత
  • రంగంలోకి అదనపు బలగాలు

తిరంగా బైక్ ర్యాలీని విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ విద్యార్థి సంఘం సంయుక్తంగా చేపట్టిన తరువాత ఏర్పడిన మత కలహాలు, ఆపై ఓ యువకుడి మరణంతో ఉత్తర ప్రదేశ్ అట్టుడికిపోతోంది. తిరంగా ర్యాలీలో 'పాకిస్థాన్ జిందాబాద్' అన్న నినాదాలు వినిపించడంతో గొడవ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆపై చెలరేగిన అల్లర్లలో చందన్ గుప్తా (22) మరణించగా, పలువురికి గాయాలు అయ్యాయి. వారిగి బులెట్ గాయాలు అయ్యాయని తెలియడంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగుతున్నాయి.

ముఖ్యంగా కాస్ గంజ్ జిల్లా అట్టుడుకుతోంది. పట్టణంలోని మార్కెట్ ను ఓ వర్గం వారు పూర్తిగా దగ్ధం చేశారు. రోడ్డుపై కనిపించిన వాహనాలను తగులబెట్టారు. అల్లర్లను అదుపు చేసేందుకు భారీ ఎత్తున బలగాలను రంగంలోకి దించిన రాష్ట్ర ప్రభుత్వం, ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. పరిస్థితిని సమీక్షించిన సీఎం యోగి ఆదిత్యనాథ్, అల్లర్లకు పాల్పడిన వాళ్లపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అల్లర్లు చేస్తున్న వారిలో 49 మందిని అరెస్ట్ చేసినట్టు కస్ గంజ్ జిల్లా కలెక్టర్ ఆర్పీ సింగ్ తెలిపారు. 144 సెక్షన్ విధించామని అన్నారు. డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టామని, సున్నిత ప్రాంతాలకు అదనపు బలగాలను తరలించామని అన్నారు.

More Telugu News