Kamlesh Nagarkoti: కోటీశ్వరులైన అండర్-19 ఆటగాళ్లు.. కనీస ధర రూ.20 లక్షలు.. రికార్డు స్థాయిలో కొనుగోలు!

  • అత్యధిక ధరకు అమ్ముడుపోయిన కమలేష్
  • అండర్-19 జట్టు కెప్టెన్, వైస్ కెప్టెన్‌లకు కూడా భారీ రేటు
  • విదేశీ ఆటగాళ్లు దీటుగా ధర

ఐపీఎల్ పుణ్యమా అని టీమిండియా అండర్-19 ఆటగాళ్లు ఒక్క దెబ్బకు కోటీశ్వరులుగా మారిపోయారు. అండర్-19 ప్రపంచకప్‌లో గంటకు 145 కిలోమీటర్ల వేగంతో బంతులు విసురుతున్న 18 ఏళ్ల కమలేష్ నాగర్‌కోటిని శనివారం జరిగిన ఐపీఎల్ వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ రూ.3.2 కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పటి వరకు జరిగిన వేలంలో ఖరీదైన అండర్-19 ఆటగాడు కమలేషే. ఇతని కనీస ధర రూ.20 లక్షలు కాగా ఏకంగా రూ.3.2 కోట్లు పలకడం విశేషం.

అండర్-19 జట్టు కెప్టెన్ పృథ్వీషాను ఢిల్లీ డేర్ డెవిల్స్ రూ.1.2 కోట్లకు కొనుగోలు చేసింది. పృథ్వీ కోసం రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్ పోటీ పడగా చివరికి రూ.1.2 కోట్లతో ఢిల్లీ డేర్ డెవిల్స్ సొంతం చేసుకుంది. అండర్-19 జట్టు వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ రూ.1.8 కోట్లకు కొనుగోలు చేసింది. వీరిద్దరి బేస్ ప్రైస్ రూ.20 లక్షలు కాగా కోటి రూపాయలకు పైగా పలకడం విశేషం.

More Telugu News