Saina Nehwal: ఇండోనేసియా మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ: సెమీఫైనల్లోనూ విజయ దుందుభి మోగించిన సైనా నెహ్వాల్

షార్ట్స్‌లో చూడండి
భారత బ్యాడ్మింట‌న్ స్టార్‌ క్రీడాకారిణి, హైద‌రాబాదీ సైనా నెహ్వాల్‌ ఇండోనేసియా మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో అద‌ర‌గొట్టేస్తోంది. నిన్న‌ జరిగిన క్వార్టర్స్‌లో పీవీ సింధుని ఓడించి సైనా సెమీస్‌కు చేరిన విషయం తెలిసిందే. ఈ రోజు సెమీఫైనల్లో థాయ్‌లాండ్ క్రీడాకారిణి ఇంతనోన్‌ రచనోక్‌పై సైనా విజ‌య దుందుభి మోగించింది. ఆద్యంతం నువ్వా? నేనా? అన్న‌ట్లు జ‌రిగిన ఈ పోటీలో సైనా 21-19, 21-19 తో గెలిచి ఫైనల్‌కు దూసుకెళ్లింది. సైనా నెహ్వాల్ ఇదే దూకుడుని కొన‌సాగిస్తే ఫైన‌ల్లోనూ గెల‌వ‌డం ఖాయ‌మ‌ని క్రీడా విశ్లేష‌కులు అంటున్నారు. 
Go Back to Shorts
Saina Nehwal
indonesia
badminton
won

More Telugu News