sai dharam tej: అదరగొట్టేస్తోన్న 'ఇంటిలిజెంట్' టీజర్

  • సాయిధరమ్ తేజ్ హీరోగా 'ఇంటిలి జెంట్'
  • ఫిబ్రవరి 4వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ 
  • ఫిబ్రవరి 9న సినిమా రిలీజ్    
వినాయక్ దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా 'ఇంటిలిజెంట్' సినిమా చేశాడు. లావణ్య త్రిపాఠి కథానాయికగా నటించిన ఈ సినిమా నుంచి, తాజాగా టీజర్ ను రిలీజ్ చేశారు. ముందుగా చెప్పిన ప్రకారం ఈ సినిమా టీజర్ ను బాలకృష్ణ చేతుల మీదుగా రిలీజ్ చేయించారు. యాక్షన్ సీన్స్ పై ఈ టీజర్ ను కట్ చేశారు. వినాయక్ తరహా మార్క్ తో .. సాయి ధరమ్ తేజ్ మార్క్ స్టైల్ తో ఈ సినిమా తెరకెక్కినట్టు ఈ టీజర్ ను బట్టి అర్థమవుతోంది.

 "ఇక మీదట పేదోడికి ప్లాట్ ఫామ్ .. ధర్మాబాయ్ డాట్ కామ్" అంటూ సాయిధరమ్ తేజ్ చెప్పిన డైలాగ్ బాగా పేలింది. సాయిధరమ్ తేజ్ కొత్త లుక్ తో కనిపిస్తూ, తన అభిమానులను మరింతగా ఆకట్టుకునేలా వున్నాడు. ఫిబ్రవరి 9వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. వచ్చేనెల 4వ తేదీన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రి - గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో జరగనుంది.
sai dharam tej
lavanya

More Telugu News