Pawan Kalyan: నాకు అధికారం రావడం ముఖ్యం కాదు.. అదొక్కటి చాలు: పవన్ కల్యాణ్

  • నాకు రైతు రాజైతే చాలు అదే ఎక్కువ‌
  • జ‌న‌సేన పార్టీకి ఓటేయ‌మ‌ని నేను అడ‌గ‌ను
  • అత్య‌ధిక క‌ర‌వు మండ‌లాలు ఉన్న జిల్లా అనంతపురం
  • రైతు బానిస కాకూడదు
జ‌న‌సేన పార్టీకి ఓటేయ‌మ‌ని తాను అడ‌గ‌నని, తనకు గెలవడం కంటే కూడా రైతుల సమస్యలు తీర్చడమే ముఖ్యమని సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. ఈ రోజు ఆయన అనంతపురంలో మాట్లాడుతూ... తనకు రైతు రాజైతే చాలని, తనకు అదే ఎక్కువ అని వ్యాఖ్యానించారు. అత్య‌ధిక క‌ర‌వు మండ‌లాలు ఉన్న జిల్లా అనంతపురమని అన్నారు. కరవు సమస్యలంటూ ప్రభుత్వాలు ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెడుతున్నాయని, ఇందు కోసం అన్ని విభాగాలు ఉన్నాయని, కానీ అవి స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేయ‌డం లేదని ఆరోపించారు.

గెలుపు ఓటములు తనకు కొత్త కావని పవన్ కల్యాణ్ అన్నారు. రైతు రాజు కావాలని, బానిస కాకూడదని, రైతుల తరఫున తాను పోరాడతానని అన్నారు. ఇక ప్రభుత్వాలతో గొడవలు పెట్టుకునే ఉద్దేశం తనకు లేదని, కానీ, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరానికి కృషి చేస్తానని అన్నారు.   
Pawan Kalyan
Jana Sena
Anantapur District

More Telugu News