kerala: అబ్బాయిల బైక్ ఎక్కొద్దు... తమ విద్యార్థినుల‌కు కేర‌ళ కాలేజీ ఆదేశం

  • నోటీసు జారీ చేసిన మౌంట్ జియోన్ లా కాలేజీ
  • పోలీసుల ఆదేశాల మేర‌కు నోటీసు ఇచ్చామ‌న్న కాలేజీ ప్రిన్సిపాల్‌
  • అలాంటి ఆదేశాలు ఇవ్వ‌లేదంటూ ఖండించిన పోలీసులు

అబ్బాయిల బైక్‌లు అమ్మాయిలు ఎక్క‌కూడ‌ద‌ని, అలా ఎక్కాలంటే త‌ల్లిదండ్రుల అనుమ‌తి ప‌త్రాన్ని కాలేజీలో ఇవ్వాలంటూ కేర‌ళ‌లోని ప‌తానంతిట్టాలో ఉన్న మౌంట్ జియోన్ లా కాలేజీ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేర‌కు క‌ళాశాలలో నోటీసులు కూడా విడుద‌ల చేసింది. అయితే ఆ ప్రాంత పోలీసుల ఆదేశం మేర‌కు తాము ఈ నోటీసులు జారీ చేసిన‌ట్లు కాలేజీ ప్రిన్సిపాల్ పాల్ గోమెజ్ చెబుతున్నారు. 'మా కాలేజీలో అమ్మాయిలు, అబ్బాయిలు క‌లిసి ఒకే బండి మీద రావ‌డంపై ఎలాంటి నిషేధం లేదు. కానీ స్థానిక పోలీసులు విద్యా సంస్థ‌ల‌కు ఇచ్చిన ఆదేశాల మేర‌కు కొత్త‌గా ఈ నిషేధాన్ని విధించాం' అని ఆయ‌న అన్నారు.

అయితే దీనిపై ప‌తానంతిట్టా పోలీసులు మ‌రోలా స్పందించారు. తాము ఎలాంటి ఆదేశాలు జారీ చేయ‌లేదంటూ ప్రిన్సిపాల్ వ్యాఖ్య‌ల‌ను ఖండించారు. దీనిపై ప్రిన్సిపాల్ మ‌రోసారి స్పందిస్తూ ఇంజినీరింగ్ కాలేజీ నుంచి వ‌చ్చిన కొన్ని ఫిర్యాదుల మేర‌కు జ‌న‌వ‌రి 11న నోటీసులు జారీ చేశామ‌ని, త‌ర్వాత విద్యార్థులు నిర‌స‌న తెల‌ప‌డంతో నోటీసును వెన‌క్కి తీసుకున్నామ‌ని అన్నారు. పోలీసుల ఆదేశాలు అంటూ ముందు చేసిన వ్యాఖ్య‌ల‌పై ఆయ‌న ఎలాంటి వివ‌ర‌ణ ఇవ్వ‌కపోవ‌డం గ‌మ‌నార్హం.

More Telugu News