PV Sindhu: పీవీ సింధుపై విజయం సాధించి.. సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన సైనా నెహ్వాల్

షార్ట్స్‌లో చూడండి
ఇండోనేషియా మాస్టర్స్‌ టోర్నీలో ఈ రోజు భారత స్టార్ షట్లర్లు, హైదరాబాదీయులు సైనా నెహ్వాల్‌, పీవీ సింధు తలపడ్డారు. క్వార్టర్స్‌లో సైనా నెహ్వాల్ చేతిలో రెండు వరుస గేమ్‌లలో సింధు ఓడిపోయింది. 21-13, 21-19తో సైనా విజయం సాధించి, సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. మరోవైపు పీవీ సింధు టోర్నీ నుంచి నిష్క్రమించింది.  

కాగా, అంతకు ముందు జరిగిన మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో 21–12, 21–9తో ప్రపంచ జూనియర్‌ మాజీ చాంపియన్‌ గో జిన్‌ ను ఓడించింది. సైనా 21–12, 21–18తో ప్రపంచ 20వ ర్యాంకర్‌ చెన్‌ జియోజిన్ పై గెలుపొందింది. దీంతో క్వార్టర్స్ లో ఈ ఇద్దరు హైదరాబాదీయులు తలపడ్డారు. 
Go Back to Shorts
PV Sindhu
Saina Nehwal
badminton

More Telugu News