GST: ఉదయం 8:58 నుంచి... ప్రపంచవ్యాప్తంగా 'జీఎస్టీ'కి స్పందన ఇది!

  • నెట్టింట విడుదలైన 'జీఎస్టీ'
  • ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన
  • నిమిషాల వ్యవధిలో ఆకాశానికి సెర్చ్ గ్రాఫ్

ఈ ఉదయం సరిగ్గా 9 గంటలకు రాంగోపాల్ వర్మ నిర్మించిన జీఎస్టీ (గాడ్ సెక్స్ అండ్ ట్రూత్) చిత్రం నెట్టింట విడుదల కాగా, అంతకు నిమిషాల ముందు నుంచే ప్రపంచవ్యాప్తంగా సెర్చింజన్ ట్రెండ్స్ మారిపోయాయి. ఈ సినిమా ఎక్కడ ఉందంటూ, లక్షలాది మంది నెట్లో వెతకడం మొదలు పెట్టారు.

ఈ విషయాన్నే తన సోషల్ మీడియాలో పంచుకున్న ఆయన, గత నాలుగు గంటల్లో వరల్డ్ వైడ్ ట్రెండ్ ఇలా ఉందంటూ ఓ గ్రాఫ్ ను చూపిస్తూ పోస్టు చేశారు. ఈ గ్రాఫ్ 'జీఎస్టీ' కోసం వెతుకుతున్న వారి సంఖ్యను సూచిస్తోంది. పది గంటల సమయంలో దాదాపు 2 లక్షల మంది దీని గురించి వెతుకుతున్నట్టు కనిపిస్తోంది. ఇక నెట్లో ఈ చిత్రాన్ని చూడాలంటే నిర్మాణ సంస్థ 'స్ట్రయిక్ ఫోర్స్' రూ. 150ని వసూలు చేస్తున్నదన్న సంగతి తెలిసిందే.

More Telugu News