ఆగని పెట్రోల్, డీజిల్ ధరల మంట... హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రూ.76.76
- డీజిల్ ధర రూ.69.02
- దేశీయ, అంతర్జాతీయ అంశాలతో పెరుగుదల
- మూడేళ్ల గరిష్ట స్థాయికి ధరలు
ఇక ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.80.39 కాగా, చెన్నైలో రూ.75.18గా ఉంది. దేశీయ, అంతర్జాతీయ అంశాలే చమురు ధరల పెరుగుదలకు కారణమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. పెట్రోల్ ఎగుమతి దేశాల కూటమి ఉత్పత్తిని తగ్గించడంతో ధరలు పెరుగుతున్నాయంటున్నారు. ఈ రోజు బ్రెంట్ క్రూడాయిల్ ఒక బ్యారెల్ 70 డాలర్ల మార్క్ ను దాటుకుని 71.03 డాలర్లకు చేరుకుంది.